ద్విచక్ర వాహనం బోల్తా.. ఇద్దరికి తీవ్రగాయాలు
KMR: సిరిసిల్ల జిల్లా తిమ్మాపూర్ శివారులోని కెనాల్ వద్ద రోడ్డుపై గుంతల కారణంగా ద్విచక్ర వాహనం బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన యాదగిరి, నర్సింహులు సిరిసిల్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కెనాల్ వద్ద ఏర్పడిన పెద్ద గుంతలో వాహనం పడటంతో యాదగిరి తలకు తీవ్ర గాయాలయ్యాయి. నర్సింహులుకు స్వల్ప గాయాలయ్యాయి.