హామీ ఇచ్చిన నేటికి ప్రారంభం కానీ రోడ్డు పనులు

హామీ ఇచ్చిన నేటికి ప్రారంభం కానీ రోడ్డు పనులు

BDK: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం నుంచి వనందాసు గడ్డ మధ్య నిలిచిపోయిన రోడ్డును తక్షణమే ఏర్పాటు చేయాలని సోమవారం గిరిజన జేఏసీ నాయకుడు పూర్ణ చందర్ నాయక్ డిమాండ్ చేశారు. కోర్టు వివాదం కారణంగా ఆ రోడ్డు నిలిచిపోయిందని, స్వయంగా నేనే దగ్గరుండి రోడ్డు వేయిస్తానని ఎమ్మెల్యే కూనంనేని హామీ ఇచ్చిన నేటికి పనులు ప్రారంభం కాలేదు అన్నారు.