కత్తితో వ్యక్తిపై హత్యాయత్నం

HYD: రెయిన్‌బజార్ పీఎస్ పరిధిలో రౌడీ షీటర్ ఖిజార్ యాకుబీపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన శుక్రవారం డబీర్‌పురా దర్వాజా వద్ద జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఖిజార్‌ను చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.