'గిరిజన యువత క్రీడల్లో రాణించాలి'
ASR: గిరిజన యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, క్రీడల్లో రాణించాలని జీ.మాడుగుల ఎస్సై బోనంగి సాయిరామ్ పడాల్ సూచించారు. మంగళవారం ఆయన తమ సిబ్బంది, ఏపీఎస్పీ సిబ్బందితో కలిసి చింతగొప్ప, రాచరాయి, చిలకపనస, కిల్లంకోట తదితర మారుమూల గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించారు. గంజాయి సాగు, రవాణా, నాటుసారా తయారీకి దూరంగా ఉండాలని సూచించారు.