పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణాల కొరకు స్థల పరిశీలన

పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణాల కొరకు స్థల పరిశీలన

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూర్‌లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం కోసం ప్రతిపాదిత స్థలాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు త్వరలో నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.