ఘనంగా వీర భద్ర స్వామి జాతర
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని కలదుర్కి గ్రామంలో నిన్న రాత్రి వీరభద్ర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. రాత్రి 9:00 గంటలకు మొదలై 11:00 గంటలకు ముగిసింది. ఈ రథోత్సవంలో మహారాష్ట్ర తెలంగాణ ప్రజలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీర భద్ర స్వామి రథోత్సవాన్ని విజయవంతం చేశారు.