5G సెల్ ఫోన్లు ఇవ్వండి: సుధారాణి

VZM: అంగన్వాడీలకు 5G సెల్ ఫోన్లు ఇవ్వాలని CITU నాయకురాలు సుధారాణి డిమాండ్ చేశారు. గరివిడి ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలతో కలిసి సోమవారం నిరసన తెలిపారు. అనంతరం వారి వద్దనున్న ఫోన్లను అధికారులకు అప్పగించారు. ఫోన్లు సరిగా పనిచేయకపోతే అప్పగించిన పనిని ఎలా చేస్తారని సుధారాణి ప్రశ్నించారు. యాప్ లు పనిచేయక చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారన్నారు.