అరకు–పాడేరు టోల్ గేట్ సమస్యలపై వినతి
ASR: హుకుంపేట మండలం పెద్దగరువు టోల్ గేట్ వద్ద వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డా. తెడబారికి సురేష్ కుమార్ సంబంధిత అధికారులకు గురువారం వినతిపత్రం సమర్పించారు. 60 కిలోమీటర్ల పరిధిలోని స్థానిక వాహనదారులకు లోకల్ ప్రీ పాస్ లేదా ఆధార్ ఆధారంగా టోల్ మినహాయింపు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.