VIDEO: వర్షం ఎఫెక్ట్.. షాపుల్లో చేరిన వర్షపు నీరు
ATP: రాయదుర్గం పట్టణంలో నిన్నటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం కురిసిన భారీ వర్షం కారణంగా బస్టాండ్ వద్ద ఉన్న షాపుల్లోకి వర్షపు నీరు చేరడంతో షాపు యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అల్పపీడన ప్రభావంతో నిన్నటి నుంచి వర్షాలు జోరుగా కొనసాగుతున్నాయి. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచించారు.