VIDEO: సీఎం దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: కవిత
RR: సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరితగతిన వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. షాద్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత ఆసుపత్రిలో ప్రాథమిక సదుపాయాల కొరత, పరికరాల పనితీరు దెబ్బతినడం బాధాకరమన్నారు. ఆసుపత్రిలో వైద్యులను నియమించి, రోగులను ఆదుకోవాలన్నారు.