టైలరింగ్ ఉచిత శిక్షణకు దరఖాస్తు పొడిగింపు
NLG: నల్గొండ శివారులోని రాంనగర్ SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు 31 రోజులపాటు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు సంచాలకుడు రఘుపతి తెలిపారు. శిక్షణార్థులకు ఉచిత టూల్ కిట్, వసతి, భోజనం సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. 18–45 ఏళ్ల ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మహిళలు నవంబర్ 3 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.