ఆగస్టు 12న TMJF రాష్ట్ర మహాసభ

ఆగస్టు 12న TMJF రాష్ట్ర మహాసభ

KNR: ఆగస్టు 12న, మంగళవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరగబోయే TMJF 2వ రాష్ట్ర మహాసభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు మొలుగూరి తిరుపతి కోరారు. జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన మాదిగ జర్నలిస్టు సోదరులు అధిక సంఖ్యలో హాజరై మహాసభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.