జగన్ ప్రతిపాదనపై ప్రజలు నవ్వుతున్నారు: మంత్రి

జగన్ ప్రతిపాదనపై ప్రజలు నవ్వుతున్నారు: మంత్రి

AP: మాజీ సీఎం జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి పార్థసారథి ఎద్దేవా చేశారు. సొంత పార్టీ నాయకులే ఆయన ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. 34వేల ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగాన్ని జగన్ అవమానించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య సాక్షిగా వైసీపీకి ప్రజలే చరమగీతం పాడుతారని చెప్పారు. రాష్ట్రానికి అమరావతి ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందన్నారు.