VIDEO: మెడికల్ కాలేజీపై కవిత విమర్శలు
SRPT: జిల్లా మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల కొరతపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. 350 మంది ఉండాల్సిన చోట 150 మందే ఉన్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దత్తత గ్రామం చీదెళ్ళలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. కోదాడ, సూర్యాపేట ఎమ్మెల్యేలు బాధ్యత విస్మరించి ఒకరిపైకొకరు నెట్టుకుంటున్నారని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు.