చెంచు పెంటలో కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా

చెంచు పెంటలో  కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా

NGKL: అమ్రాబాద్ మండలం మన్ననూరు మల్లాపూర్ చెంచు పెంటలో ఆకస్మికంగా మరణించిన బయన్న కుటుంబానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదేశాల మేరకు రూ. 5,000 నగదు, 50 కేజీల బియ్యాన్ని ఆదివారం అందజేశారు. మృతుని భార్య బాలాగురువమ్మ, ముగ్గురు పిల్లలకు ప్రభుత్వ హాస్టల్లో వసతి కల్పించి, బాలాగురువమ్మకు ఉపాధి చూపిస్తానని ఆయన హామీ ఇచ్చారు.