రోడ్డు ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్

రోడ్డు ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్

ELR: ఏలూరు-దుగ్గిరాల జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విజయరాయి నుంచి విజయవాడకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఘటనలో ఒకరు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.