"పోక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష "
MLG: వాజేడు మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన సోడి సందీప్ (21) పై ఇటీవల పోక్సో కేసు నమోదయింది. అయితే ఇవాళ జిల్లా కోర్టు సందీప్ కు 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.9,000 జరిమానా విధించింది. బాధితురాలికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారులు అశోక్ కుమార్, సంకీర్త్ (ఐపీఎస్), స్పెషల్ పీపీ డి.రాంసింగ్‌ను SP శబరిష్ అభినందించారు.