VIDEO: పర్యాటకులతో కిటకిటలాడిన గిరిజన మ్యూజియం

VIDEO: పర్యాటకులతో కిటకిటలాడిన గిరిజన మ్యూజియం

ASR: అరకులోయ గిరిజన మ్యూజియంను శుక్ర, శనివారాలలో 5,188 మంది సందర్శించినట్లు మ్యూజియం సిబ్బంది తెలిపారు. ఈ రెండు రోజుల్లో మ్యూజియానికి రూ. 3.28 లక్షల ఆదాయం వచ్చినట్లు మ్యూజియం ఇంఛార్జ్ మణికుమార్ వెల్లడించారు. కాగా, మ్యూజియంలోని ఆదివాసీ గిరిజన ఆచార వ్యవహారాల కళాకృతులు, అడ్వంచర్ యాక్టివిటీలు, దింసా నృత్య ప్రదర్శన పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.