'మోసం చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలి'
KRNL: గోనెగండ్లలో అమాయక రైతులకు కావేరి నకిలీ మొక్కజొన్న సీడు ఇచ్చి మోసం చేసిన డీలర్ నబీషా, సబ్ డీలర్ మహేష్‌ను తక్షణమే అరెస్టు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని శనివారం సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి. రంగన్న జిల్లా సమితి సభ్యులు మద్దిలేటి నాయుడు డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు.