ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరికి గాయాలు

JGL: జగిత్యాల పట్టణంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారి బస్ డిపో సమీపంలో వర్షపు నీరు కారణంగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరికి గాయాలయ్యాయి. గాయాల పాలైన వ్యక్తిని స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి కోమాలోకి వెళ్లడంతో వివరాలు తెలియడం లేదు. ఈ సంఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.