VIDEO: సాయి మందిరంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

SKLM: నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక మారుతి నగర్‌లో ఉన్న సాయి మందిరంలో భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను చేపట్టారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా వేద పండితులు మావుడూరి జగదీష్ శర్మ మాట్లాడుతూ.. శ్రావణమాసం చివరి శుక్రవారం కావడంతో ముత్తైదువులు వరలక్ష్మి వ్రతాలలో పాల్గొన్నారని తెలిపారు.