VIDEO: అయినవిల్లిలో 'పవన్ అన్న ఆరోగ్య భరోసా' కార్యక్రమం

VIDEO: అయినవిల్లిలో 'పవన్ అన్న ఆరోగ్య భరోసా' కార్యక్రమం

కోనసీమ: ప్రతి గ్రామంలో నిరుపేదలకు వైద్యం అందించడమే లక్ష్యంగా 'పవన్ అన్న ఆరోగ్య భరోసా' కార్యక్రమం చేపట్టామని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామంలో మంగళవారం ఆరోగ్య భరోసా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.