ట్రిపుల్ ఐటీ కోసం భూములను పరిశీలించిన ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి మండలంలోని బల్లిపల్లి గ్రామంలో ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణం కోసం భూములన కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ భాస్కర్ పటేల్ గురువారం పరిశీలించారు. బల్లిపల్లిలో అందుబాటులో ఉన్న 250 ఎకరాల ప్రభుత్వ భూమిని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ భాస్కర్ పటేల్ పరిశీలించారు. నివేదికను ప్రభుత్వానికి పంపుతామని ఆయన తెలిపారు.