'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

CTR: మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయని పుంగనూరు కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. నీటి మట్టాన్ని పరిశీలిస్తూ పరివాహక ప్రాంతాల ప్రజలను హెచ్చరించాలన్నారు. ఎమర్జెన్సీ టీం సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఫిర్యాదుల కోసం ప్రజలు 08581252166 నంబర్ కు కాల్ చేయాలని సూచించారు.