వాడి వాగును పరిశీలించిన సబ్ కలెక్టర్

KMR: డోంగ్లి మండలం వాడి గ్రామానికి వెళ్లే రహదారిపై ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాడి వాగును సబ్ కలెక్టర్ కిరణ్మయి శనివారం పరిశీలించారు. వాగుకు ఆవతలి వైపు ఉన్న గ్రామస్థులతో చరవాణి ద్వారా మాట్లాడారు. వర్షాలు తగ్గిన తర్వాత గ్రామాన్ని సందర్శిస్తానని, సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.