మాజీ ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పాయం

KMM : మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందారు. కాగా ఇల్లందు మండలం సుదిమల్ల గ్రామపంచాయతీ హనుమంతుపాడులో శుక్రవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఊకే అబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అబ్బయ్య మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి తోడుగా ఉంటానని భరోసానిచ్చారు.