'రైతులకు యూరియా సరఫరాపై కలెక్టర్లు దృష్టి సారించాలి'

'రైతులకు యూరియా సరఫరాపై కలెక్టర్లు దృష్టి సారించాలి'

NRPT: రైతులకు సరిపడ యూరియా సరఫరాపై కలెక్టర్లు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. సోమవారం హైదరాబాద్ సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. అనంతరం ఆమె రైతులు ప్రస్తుత అవసరాల మేరకు యూరియా కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.