PHCని తనిఖీ చేసిన కలెక్టర్

PHCని తనిఖీ చేసిన కలెక్టర్

MNCL: లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లను తనిఖీ చేసిన ఆయన, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు.