కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

WNP: వర్షాల నుంచి ప్రజలకు కలిగే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్‌తో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.