నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

RR: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గురువారం అన్నారు. నందిగామ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి రూ. 2 కోట్ల 30 లక్షలు మంజూరైనట్లు తెలిపారు.