రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

SDPT: దుబ్బాక మండలం హబ్షీపూర్ గ్రామ శివారులో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేసీఆర్ నగర్‌కు చెందిన మంతూరి విఠల్ తన కుమారుడు చంద్రశేఖర్‌తో కలిసి ఎక్సెల్ పై హబ్షీపూర్ నుంచి సిద్దిపేటకు వెళ్లే క్రమంలో ఓ కారు ఢీ కొట్టింది. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించగా ఒకరు గాయపడగా, ఓ వ్యక్తి చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందాడు.