ఓయూ PS అభివృద్ధికి డిప్యూటీ మేయర్ హామీ
HYD: ఓయూ PS సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అప్పలనాయుడు శుక్రవారం GHMC డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిని కలిశారు. పీఎస్‌లో అత్యవసరంగా చేపట్టాల్సిన పలు మరమ్మతులు, అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఇందుకు సంబంధించి వినతి పత్రాన్ని డిప్యూటీ మేయర్‌కు అందజేశారు. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ మేయర్ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.