'ఆధ్యాత్మిక సాధన లేనిదే జీవితం పరిపూర్ణం కాదు'
NLR: కార్తీక మాసంలో నిష్టగా స్నానం ఆచరించి ఉసిరి వృక్షం ఉన్నచోట దీప ప్రజ్వలన చేయడం అత్యంత శ్రేష్టమని శ్రీ తాండవ కాశీ క్షేత్ర తపోవన మఠాధిపతి సచ్చిదానంద సరస్వతి మహాస్వామి అన్నారు. ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున 24 నిమిషాల పాటు దైవ ధ్యానంలో గడపడం ఎంతో శ్రేష్ఠమన్నారు. భక్తులు స్వామి వారిని నిష్టగా దర్శించుకున్నారు.