కశ్మీర్‌లో విద్యాసంస్థలు మూసివేత

పాకిస్తాన్‌పై భారత్ ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' నేపథ్యంలో కశ్మీర్‌లోని మూడు జిల్లాల్లో విద్యాసంస్థలను మూసివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా బారాముల్లా, కుప్వారా, గురేజ్ ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.