కేసముద్రం మీసేవ కేంద్రాల్లో నిరసన కార్యక్రమం

MHBD: మీసేవ కమిషనర్, ఈఎస్డీ, తెలంగాణ ప్రభుత్వం శ్రీ తిరుమల రవికిరణ్ గారిపై జరిగిన బెదిరింపులను ఖండిస్తూ కేసముద్రం మీసేవ కేంద్రాల్లో ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించేందుకు కృషి చేస్తున్న కమిషనర్‌పై ఈ తరహా బెదిరింపులు అంగీకారయోగ్యం కాదని సిబ్బంది పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.