బైక్ అదుపుతప్పి గుంతలో పడి వ్యక్తి మృతి

బైక్ అదుపుతప్పి గుంతలో పడి వ్యక్తి మృతి

మేడ్చల్: మేడ్చల్ పీఎస్ పరిధిలో బైక్ అదుపుతప్పి గుంతలో పడి దేవేందర్ రెడ్డి (43) మృతి చెందాడు. రామడ్డి బాయ్‌కు చెందిన ఆయన వరి కోతల మిషన్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. రాత్రి శ్రీరంగవరం గ్రామ చౌరస్తా వద్ద బైక్‌పై వెళ్తూ అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.