గోదావరిలో దిగి వ్యక్తి గల్లంతు
W.G: ఆచంట మండలం కరుగోరుమిల్లి గోదావరిలో దిగి వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కె.వెంకటరమణ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం పెద్దిరాజు(55) అనే వ్యక్తి గోదావరి నదిలో పశువులను కడుగుతుండగా గల్లంత్తైనట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలు చేపట్టగా అతడి మృతదేహం లభ్యమైనట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.