సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

KKD: కోటనందూరు మండలం కొత్తకొట్టాంలోని 4వ వార్డులో ఉపాధి నిధులతో నిర్మిస్తున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు. రోడ్డు నిర్మాణ పనులను గ్రామ మాజీ సర్పంచ్ చిటికెల సత్యనారాయణ(సత్తిబాబు) దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధియే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.