అక్రమాస్తుల కేసులో శాంతికి రిమాండ్ పొడిగింపు

అక్రమాస్తుల కేసులో శాంతికి రిమాండ్ పొడిగింపు

NTR: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేవాదాయ శాఖ ఏసీ శాంతి రిమాండ్‌ను వచ్చే నెల 5 వరకు పొడిగిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం నిందితురాలిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. శాంతిని 3 రోజులుగా కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ శాంతి న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. ఈ వాదనలపై నేడు విచారన జరగనుంది.