శాప్ లీగ్స్–2026 పోస్టర్ల ఆవిష్కరించిన కలెక్టర్
NTR: శాప్ లీగ్స్–2026లో భాగంగా ఏప్రిల్ 11, 12 తేదీలలో విజయవాడ పున్నమి ఘాట్ వద్ద వాటర్ స్పోర్ట్స్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ డా. జి. లక్ష్మీశ దీనికి సంబంధించిన పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.