ఉగాది పచ్చడి వితరణ చేసిన కలెక్టర్
NLG: ప్రకృతి ప్రసాదించిన పానీయాలతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఉగాది సందర్భంగా టీఎస్ యూటీఎఫ్, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గడియారం సెంటర్ వద్ద ఉగాది పచ్చడి వితరణ చేశారు. రసాయనాలతో కూడిన కృత్రిమ పానీయాలను వీడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.