ఆటో ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు

CTR: ఆటో బైక్ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డ ఘటన బురకాయలకోటలో జరిగింది. బి.కొత్తకోట మండలం, తుమ్మనగుట్ట పంచాయతీ, సుంకరవారిపల్లెకు చెందిన రామస్వామి, భార్య నారాయణమ్మ, ఈశ్వరమ్మలు గురువారం రాత్రి బైక్‌పై సొంత పనిమీద బురకాయలకోటకు బయలుదేరారు. మార్గమధ్యంలోని బురకాయలకోట పెట్రోల్ బంకు వద్దకు వెళ్లగానే ఆటో ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు.