పెద్దపల్లిలో దివ్యాంగులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు
పెద్దపల్లి జిల్లాలో శనివారం దివ్యాంగుల కోసం జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. డిసెంబర్ 3న జరగనున్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ పోటీల్లో శారీరక, వినికిడి, దృష్టి, మరుగుజ్జు విభాగాల నుంచి అనేక మంది క్రీడాకారులు పాల్గొన్నారు. డిసెంబర్ 3న విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారని నిర్వాహకులు ప్రకటించారు.