మీ సేవ బాబుపై పోలీసులకు ఫిర్యాదు
ATP: ఈ-స్టాంపుల కుంభకోణానికి పాల్పడిన మీ సేవ బాబుపై కళ్యాణదుర్గానికి చెందిన చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరిలో మీ సేవ బాబు నుంచి రూ.7,500ల విలువైన ఈ-స్టాంపు కొనుగోలు చేశానని తెలిపారు. తాను కొనుగోలు చేసిన ఈ-స్టాంపును స్టాక్ హోల్డింగ్ యాప్‌లో చెక్ చేయగా, ఫేక్ అని తేలడంతో లీగల్ సమస్య తలెత్తకుండా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.