విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

E.G: అనపర్తిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం సాయంత్రం అభినందించారు. ఇటీవల జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు ఆయన అపాయింట్‌మెంట్ ఆర్డర్లను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మరింతగా వృద్ధి సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.