VIRAL: ఎస్కేప్ మిషన్ సక్సెస్!
చైనా జిలిన్ ప్రావిన్స్‌లో హృదయాన్ని తాకే ఘటన జరిగింది. డాగ్ మీట్ మార్కెట్‌కు అమ్మేందుకు దొంగిలించిన 7 కుక్కలను ఓ వాహనంలో తీసుకెళ్తుండగా.. అవి తప్పించుకున్నాయి. పరుగు తీయకుండా గాయపడిన జర్మన్ షెఫర్డ్ చుట్టూ రక్షణ వలయంలా నిలబడి, ముందుగా కార్గీ దారి చూపించింది. రెండు రోజుల పాటు రోడ్లు, పొలాలు దాటి సుమారు 17 కి.మీ ప్రయాణించి తమ యజమానుల వద్దకు చేరాయి.