సిరికొండలో ఘనంగా మహా అన్నప్రసాదం
JGL: కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో ఆదివారం దుర్గమ్మ సన్నిధిలో మహా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేసారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు నవ దుర్గా సమితి సభ్యులు అన్నప్రసాదం అందించారు. సహకారాన్ని అందించిన దాతలకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.