జర్నలిస్టులకు ప్రభుత్వం GOOD NEWS
AP: రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రస్తుతం అమలవుతున్న వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ గడువును మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1, 2026 నుంచి మార్చి 31, 2027 వరకు పొడిగించింది. ఈ పథకం ద్వారా అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు నెట్‌వర్క్ ఆసుపత్రిల్లో నగదు రహిత చికిత్స అందుతుంది.