ఇరువర్గాల మధ్య కొట్లాట.. ఏడుగురికి గాయాలు

VZM: బాడంగి(M) కామన్నవలస, గొల్లాది గ్రామాలకు చెందిన వారి మధ్య మంగళవారం కొట్లాట జరిగినట్లు ఎస్సై తారకేశ్వరరావు చెప్పారు. గొల్లాదికి చెందిన ఈపు ఈశ్వరరావు పోలమ్మ ఆలయం సమీపంలో మేకలు మేపుతుండగా కామన్నవలసకి చెందిన ఆదినారాయణ మేకలు మేపేందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన ఏడుగురు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.