'బాధితులను అప్రమత్తంగా ఆసుపత్రికి చేర్చాలి'
BDK: పినపాక మండలం జానంపేటకు సేవలందిస్తున్న 108 అంబులెన్సు జీవీకే గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఆడిట్ అధికారి కిషోర్ తనిఖీ చేశారు. పరికరాలు, మందుల లభ్యత, ఆక్సిజన్ నిల్వలను పరిశీలించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండి గోల్డెన్ అవర్లో బాధితులను ఆసుపత్రులకు చేర్చాలని సూచించారు. ఈ తనిఖీలో డివిజన్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ మనోహర్ ఉన్నారు.